నా ఇంటి పేరు మార్చి శునకానందం పొందారు : వైఎస్ షర్మిల

సమాజానికి మంచి చేసేది సోషల్ మీడియా.. అలాంటి వ్యవస్థను కొంతమంది సైకోలు.. సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్టు పట్టించారని.. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాల లెక్క మారారని వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

By Medi Samrat  Published on  7 Nov 2024 7:05 PM IST
నా ఇంటి పేరు మార్చి శునకానందం పొందారు : వైఎస్ షర్మిల

సమాజానికి మంచి చేసేది సోషల్ మీడియా.. అలాంటి వ్యవస్థను కొంతమంది సైకోలు.. సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్టు పట్టించారని.. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాల లెక్క మారారని వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ.. మహిళలు అనే జ్ఞానం లేకుండా, ఇంట్లో తల్లి, అక్కా, చెల్లి కూడా సాటి మహిళా అనే ఇంగితం లేకుండా.. రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో.. వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందుతున్నార‌ని ఫైర్ అయ్యారు.

సోషల్ సైకోల బాధితుల్లో నేను ఒకరిగా చెప్తున్నాను.. అసభ్యకర పోస్టులతో ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు పెట్టి.. పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు ఉండాలన్నారు. నా మీద, అమ్మ మీద, సునీత మీద విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదని అవమానించారు.. నా ఇంటి పేరు మార్చి శునకానందం పొందారన్నారు. నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై నేను కూడా పోలీస్ కేసు పెట్టాను.. అటువంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నామ‌న్నారు. అరాచక పోస్టులు పెట్టే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. మరోసారి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హాననానికి పాల్పడాలంటే.. భయపడేలా అనునిత్యం చర్యలు కొనసాగాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Next Story