సోషల్ మీడియాలో నేను ఒక బాధితురాలిని అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. నన్ను, సునీతను, అమ్మను ఎలా బడితే అలా మాట్లాడారన్నారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టాలని చెప్పింది జగన్ మోహన్ రెడ్డినేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వద్దు అని చెప్పి ఉంటే ఇవి అప్పుడే ఆగేవన్నారు.. జగన్ నోరు విప్పి ఉంటే అప్పుడే చెక్ పడేదన్నారు. సోషల్ మీడియాలో మా మీద అబద్ధాలు చెప్పారు.. అక్రమ సంబంధాలు అంట గట్టారన్నారు. బూతులు కూడా తిట్టారు.. ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టారని వాపోయారు.
ఒక సైతాన్ సైన్యం తయారయ్యింది.. వీటికి చెక్ పడాలన్నారు. మహిళలు రాజకీయాల్లో ఉండాలంటే భయపడే పరిస్థితికి తెచ్చారని మండిపడ్డారు. మా కుటుంబాల్లో కింద కామెంట్లు చదవొద్దు అనే చెప్పే పరిస్థితి ఉందన్నారు. సోషల్ మీడియాకి ఒక లిమిట్ ఉండాలి.. ఒక రెగ్యులేట్ ఉండాలన్నారు. చర్యలు అనుక్షణం కొనసాగాలన్నారు. పట్టుకున్న వాళ్ళు అంతా విషనాగులు.. కానీ వీళ్ళ వెనుక ఉన్న అనకొండను పట్టుకోవాలన్నారు. వాళ్ళపై కఠినంగా శిక్షలు ఉండాలని డిమాండ్ చేశారు.