అది పొలిటికల్ మర్డర్ కాదు.. జగన్ ఢిల్లీ ధర్నాపై షర్మిల సంచ‌ల‌న‌ కామెంట్స్‌

జగన్ హత్యా రాజకీయాలు చేశారని.. గొడ్డలి రాజకీయాలు చేశారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

By Medi Samrat  Published on  22 July 2024 6:13 PM IST
అది పొలిటికల్ మర్డర్ కాదు.. జగన్ ఢిల్లీ ధర్నాపై షర్మిల  సంచ‌ల‌న‌ కామెంట్స్‌

జగన్ హత్యా రాజకీయాలు చేశారని.. గొడ్డలి రాజకీయాలు చేశారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. వివేకా బాబాయిని హత్య చేసిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగి.. సొంత చెల్లెల్ల‌కు వెన్నుపోటు పొడిచారన్నారు. హోదా మీద బీజేపీ మోసం చేస్తే ఒక్క రోజు ధర్నా చేయలేదు.? ప్రత్యేక హోదా కావాలని ధర్నా చేయలేదు.? మీ పాలనలో ఎన్ని సార్లు ధర్నాలు చేశారు. హోదా అనే అంశం ఊసే లేకుండా చేశారన్నారు.

పోలవరం మీద పట్టింపు లేదు.. మూడు రాజధానులకు దిక్కు లేదు.. కార్యకర్త హత్య మీద ఇప్పుడు ఢిల్లీ ధర్నా అంటున్నారని విమ‌ర్శించారు. బీజేపీ నిర్లక్ష్యం మీద ఒక్క రోజు చేయలేదు.. వినుకొండ మర్డర్ రాజకీయం కాదు.. వ్యక్తిగత హత్య అని పేర్కొన్నారు. మా విచారణలో వ్యక్తిగత హత్య అని తెలిసింది.. పొలిటికల్ మర్డర్ అని జగన్ కలరింగ్ ఇచ్చారని అన్నారు.

రాష్ట్రంలో వరదలతో రైతుల అల్లాడుతున్నారు. ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో ఉండాల్సిన మీరు ఢిల్లీ వెళ్ళడం ఏమిటి? అని ప్ర‌శ్నించారు. ఇక్కడ అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చ చేయాల్సిన అవసరం లేదా..? అని ప్ర‌శ్నించారు. వినుకొండ మర్డర్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా.. నడి రోడ్డు మీద హత్యలు ఏమిటి.? శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరం మీకు లేదా.? అని అడిగారు.

Next Story