మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ దొరకడం సిగ్గుచేటని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంటే ఈ ఎంపీ ఇక్కడ కొకైన్ తో విందు చిందు చేస్తున్నాడు.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇదెక్కడి భాద్యతారాహిత్యం.? డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది కదా.. ఇప్పుడు చంద్రబాబు ఏం చర్యలు తీసుకుంటారు.? అని ప్రశ్నించారు.
డ్రగ్స్ తీసుకుంటూ పట్టబడ్డ ఎంపీ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు ? యువత డ్రగ్స్ వాడాలని నేరుగా ఎంపీ ఎంకరేజ్ చేస్తున్నారా.? ఓట్లేసి గెలిపించిన ఏలూరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు.? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంపీగా పుట్టా మహేష్‌పై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నుంచి వెంటనే సస్పెన్షన్ విధించాలన్నారు. డ్రగ్స్ వాడకంపై నిజంగా కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపితే ఏలూరు ఎంపీపై చర్యలు తీసుకొని చంద్రబాబు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.