వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో వైన్ షాపుల్లో డిజిటల్ చెల్లింపులు ఆపేసి కుంభకోణానికి పాల్పడ్డారని, ప్రభుత్వం దీనిపై లోతైన దర్యాప్తు జరపాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఇది ఆర్థిక మోసం అని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ కుంభకోణం గురించి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆమె డిమాండ్ చేశారు. గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. తయారీ నుండి అమ్మకం వరకు మొత్తం అవినీతిమయమైందని ఆరోపించారు.
ఈ డిజిటల్ యుగంలో కూడా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైన్ షాపుల్లో నగదును మాత్రమే అంగీకరించిందని ఆరోపించారు షర్మిల. ఇది కేవలం రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం కాదు, పన్నులను తప్పించుకోవడానికి నగదును మాత్రమే అంగీకరించిందన్నారు. మొత్తం విషయంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించాలని, నాన్-డ్యూటీ చెల్లింపులన్నీ బ్లాక్‌లో జరిగాయన్నారు. గత ఐదు సంవత్సరాలలో, 30 లక్షలకు పైగా ప్రజలు కిడ్నీ సమస్యల గురించి ఫిర్యాదు చేశారని, 30,000 మందికి పైగా మరణించారని షర్మిల అన్నారు.