ఇది బడ్జెట్ కాదు.. మరో మ్యానిఫెస్టో : ష‌ర్మిల

ఏపీ బ‌డ్జెట్‌పై ష‌ర్మిల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇది బడ్జెటో.. మ్యానిఫెస్టోనో ప్రజలకు క్లారిటీ లేదని అన్నారు.

By Kalasani Durgapraveen  Published on  12 Nov 2024 9:56 AM GMT
ఇది బడ్జెట్ కాదు.. మరో మ్యానిఫెస్టో : ష‌ర్మిల

ఏపీ బ‌డ్జెట్‌పై ష‌ర్మిల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇది బడ్జెటో.. మ్యానిఫెస్టోనో ప్రజలకు క్లారిటీ లేదని అన్నారు. ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు మళ్ళీ చెప్పారన్నారు. బడ్జెట్ లో స్పష్టత లేదన్నారు. బడ్జెట్ అంటే కేటాయింపులు.. ఇది కేటాయింపులు లేని బడ్జెట్.. ఇది మరో మ్యానిఫెస్టో అని కామెంట్ చేశారు.

సూపర్ సిక్స్ అమలు చేయాలి అంటే ప్రతి ఏడాది లక్షా 20 వేల కోట్లు కావాలన్నారు. చంద్రబాబు ఈ బడ్జెట్ లో కనీసం పావు వంతు కూడా కేటాయింపు చేయ‌లేద‌న్నారు. మహిళా శక్తి కింద ప్రతి నెల 15 వందలు ఇస్తా అన్నాడు.. కోటి మంది మహిళలు రాష్ట్రంలో ఉన్నారు.. ఈ పథకం కింద వచ్చే 5 నెలల్లో 7500 కోట్లు ఇవ్వాలి.. కానీ ఈ పథకానికి నిధులు రూపాయి కూడా కేటాయించలేదన్నారు.

తల్లికి వందనం కింద 15 వేలు ప్రతి బిడ్డకు ఇస్తాం అన్నాడు.. దాదాపు 10 వేల కోట్లు ఇవ్వాలి.. రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్నారు.. బడ్జెట్ లో నిధులు కేవలం 2 వేల కోట్లు.. అంటే సగం మంది పిల్లలకు నిధులు ఇవ్వరా.? అని ప్ర‌శ్నించారు.

ఉచిత బస్సు పథకానికి నిధులు ఒక్క రూపాయి ఇవ్వలేదు.. దాదాపు 2 వేల కోట్లు ఇవ్వాలి.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. ఈ ప్రభుత్వానికి ఉచిత బస్సు పథకాన్ని ఇచ్చే ఉద్దేశ్యం లేదన్నారు. అన్నదాత సుఖీభవ కింద అరకొర నిధులు ఇచ్చారన్నారు.

ప్రతి రైతుకి 20 వేలు ఏడాదికి ఇవ్వాలి.. ఈ లెక్కన 10,400 కోట్లు ఇవ్వాలి.. కానీ బడ్జెట్ లో 4500 కోట్లు కేటాయించారు.. పక్కా ఇండ్లు 8 లక్షల ఇండ్లు కట్టిస్తా అన్నారు.. ఈ పథకానికి దాదాపు 32 వేల కోట్లు కావాలి.. కానీ ఇచ్చింది కేవలం 4 వేల కొట్లేన‌న్నారు. నిరుద్యోగ భృతి 18 వేల కోట్లు కావాలి.. 3 వేలు ఇస్తామని చెప్పారు.. ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ బృతికి నిధులు లేవు అన్నారు.

గ్యాస్ సిలిండర్ల కింద కేటాయింపులు కేవలం 800 కోట్లె.. కావాల్సింది దాదాపు 4 వేల కోట్లు.. అంటే సగం మందికి సిలిండర్ల కింద కోత పెడతారా.? చంద్రబాబు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. కేటాయింపులు లేవు కానీ.. ప్రజల దగ్గర నుంచి వసూలు చేసేది ఘనం అన్నారు. కరెంటు బిల్లుల రూపంలో 17 వేల కోట్లు వసూలు చేస్తున్నారు.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతారట.. ఇది ప్రజల బడ్జెట్ కాదు..ఇది మోసపూరిత బడ్జెట్.. ఇది ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిన బడ్జెట్.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అన్యాయం చేసిన బడ్జెట్ అన్నారు.

Next Story