నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన విషయాలను రోడ్డు మీదకు తీసుకువచ్చారు: వైఎస్ షర్మిల

నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తీసుకువచ్చారని ఏపీ కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల అన్నారు

By Medi Samrat  Published on  24 Oct 2024 6:17 PM IST
నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన విషయాలను రోడ్డు మీదకు తీసుకువచ్చారు: వైఎస్ షర్మిల

నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తీసుకువచ్చారని ఏపీ కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల అన్నారు. చట్ట విరుద్ధమని తెలిసినా చెల్లెలి మీద ప్రేమతో షేర్లు బదిలీ చేశారనేది పచ్చి అబద్ధమన్నారు. వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేసేందుకు మేం కుట్రపన్నాం అనేది ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్ అని అన్నారు. ఆస్తుల మీద ఉన్న ప్రేమతో రక్త సంబంధాన్ని, అనుబంధాలను మర్చిపోయారని, నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తీసుకువచ్చారన్నారు. అది చాలదన్నట్లు ఇప్పుడు కోర్టుల వరకు తీసుకెళ్లారన్నారు.

ఇక ఈ కుటుంబ గొడవలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని, టీడీపీ అక్రమాలు, అన్యాయాలు బయటపెడుతున్నామని మళ్లీ డైవర్షన్స్‌ మొదలుపెట్టారని విమర్శించారు. ఈసారి అమ్మ, చెల్లెలు ఫొటో పెట్టి రాజకీయం చేస్తున్నారని.. ఇప్ప‌టికైనా డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ ఆపి, హామీల‌ను అమ‌లు చేయాల‌ని అన్నారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా జ‌గ‌న్ పేరు చెప్పి డైవ‌ర్ట్ చేయ‌డం ప్ర‌భుత్వానికి ఓ పనిగా మారింద‌ని విమర్శించారు. జగన్‌ గుర్లకు వస్తున్నాడని తెలిసి మళ్లీ రాజకీయం చేస్తున్నారు. మా కుటుంబ విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. వైఫల్యాలను డైవర్ట్‌ చేసేందుకే లడ్డూ అంశం తెరపైకి తెచ్చారని కావాలనే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని విమర్శించారు.

Next Story