వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్ 16వ తేదీ విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు. ఇల్లు కోల్పోయిన జోజినగర్ బాధితులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. భవానీపురం జోజినగర్‌కు చెందిన 42 ప్లాట్లకు చెందిన బాధితులు ఇటీవల వైఎస్ జగన్‌ను కలిశారు. తమ ఇళ్లను కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేయడంతో వీరికి అండగా ఉంటానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఇళ్లు కూల్చిన ప్రాంతాన్ని వైఎస్ జగన్ పరిశీలించనున్నారని వైసీపీ శ్రేణులు తెలిపాయి.