వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆయన తన భార్య వైఎస్ భారతితో కలిసి శుక్రవారం రాత్రి లండన్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. లండన్‌లో విద్యాభ్యాసం చేస్తున్న తమ పెద్ద కుమార్తె వద్దకు జగన్ దంపతులు వెళుతున్నారు. కుటుంబ సభ్యులతో కొంతకాలం గడిపేందుకే ఈ పర్యటనను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు రాత్రి బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వారు లండన్‌కు పయనం కానున్నారు. దాదాపు రెండు వారాల పాటు ఈ పర్యటన సాగనుంది. తిరిగి ఈ నెల 23వ తేదీన జగన్ దంపతులు భారత్‌కు చేరుకుంటారని సమాచారం.