అక్కడకు వెళ్లలేకపోయిన సీఎం జగన్

YS Jagan's Kadapa visit cancelled. ఏపీ సీఎం జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించాల్సి ఉండగా ఆయన పర్యటన రద్దయింది.

By Medi Samrat  Published on  6 Dec 2022 4:04 PM IST
అక్కడకు వెళ్లలేకపోయిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించాల్సి ఉండగా ఆయన పర్యటన రద్దయింది. ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు నుండి కడపకు బయలుదేరి వెళ్లాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యటన రద్దు చేసుకున్నారు. కడప ఎయిర్ పోర్టు పరిసరాల్లో దట్టమైన పొగమంచు కారణంగా ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ రాలేదు.

కడప విమానాశ్రయం పరిసరాల్లో పొగమంచు దట్టంగా ఉండడంతో ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ లభించలేదు. ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం చాలాసేపు వేచి చూసినా, వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారు. సీఎం జగన్ కడపలోని అమీన్ పీర్ ఉర్సు ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. ఈ మధ్యాహ్నం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు కూడా హాజరు కావాల్సి ఉంది. కానీ కడప విమానాశ్రయం పరిసరాల్లో పొగమంచు ఎంతకీ తొలగకపోవడంతో సీఎం పర్యటన రద్దయింది.


Next Story