నేడు అంబటి నివాసానికి వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ నేడు గుంటూరు పర్యటనకు వెళ్ల‌నున్నారు.

By -  Medi Samrat
Published on : 4 Feb 2026 8:35 AM IST

నేడు అంబటి నివాసానికి వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ నేడు గుంటూరు పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పార్టీ సీనియ‌ర్ నేత అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించ‌నున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గుంటూరు బయలుదేరుతారు. వయా.. మంగళగిరి, కాకాని, ఏటుకూరు బైపాస్ సర్వీస్‌ రోడ్‌, కేవీపీ (వీఐపీ) రోడ్, చుట్టుగుంట, కలెక్టర్‌ ఆఫీస్‌, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల మీదుగా సిద్దార్ధనగర్‌లోని అంబటి నివాసానికి చేరుకుంటారు. అక్క‌డ ఆయ‌న ఇటీవ‌ల దాడికి గురైన‌ మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం గుజ్జనగుండ్ల, స్తంభాల గరువు, కలెక్టర్‌ ఆఫీస్‌, చుట్టుగుంట, కేవీపీ (వీఐపీ) రోడ్, ఏటుకూరు బైపాస్‌ సర్వీస్ రోడ్‌, కాకాని, మంగళగిరి మీదుగా తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Next Story