ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాకు వెళ్లనున్నారు. జులై 9న వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెట్‌ను సందర్శించనున్నారు. అక్కడ మామిడి రైతులను పరామర్శించనున్నట్లు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ప్రకటించారు.
చిత్తూరు జిల్లాలో లక్షల హెక్టార్‌లలో సాగు చేసిన మామిడి పంటను కొనేవారు లేకపోవడంతో రైతులు రోడ్లపైనే పారబోస్తున్నారని వైసీపీ నేతలు తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే మామిడి రైతులు నష్టాలతో కుదేలవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. మామిడి రైతుల కష్టాలను తెలుసుకుని గిట్టుబాటు రేటు కల్పించేందుకు వైఎస్ జగన్ ఈ ప్రాంతంలో పర్యటించనున్నారని వైసీపీ నేతలు తెలిపారు.