గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు
By Medi Samrat
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని రాజ్ భవన్ కు వెళ్లనున్న జగన్ గవర్నర్ తో భేటీ అవుతారు. రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్ కు వివరించనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు జరుగుతున్నాయని.. వీటిని అడ్డుకోవాలని గవర్నర్ ను కోరనున్నారు. వినుకొండ హత్య, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాలను ధ్వంసం చేయడం లాంటి ఘటనలపై గవర్నర్ కు సాక్ష్యాలను, వీడియోలను అందజేయనున్నారని వైసీపీ తెలిపింది.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఈరోజు సాయంత్రం 5 గం.కు రాజ్‌భవన్‌కు వెళ్లి, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గారితో భేటీ కానున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను వైయస్ జగన్ గారు, రాష్ట్ర గవర్నర్ గారికి వివరించనున్నారు. వినుకొండలో పార్టీ కార్యకర్తను అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపడం, ఆ మర్నాడే పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాలు ధ్వంసం చేయడం, మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం చేయడం సహా, ఈ 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న విధ్వంసాలన్నింటి సాక్ష్యాలు, వీడియోలను వైయస్ జగన్ గారు, గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి అందజేస్తారు." అంటూ వైసీపీ తెలిపింది.