17న క‌ర్నూల్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న సీఎం జ‌గ‌న్

YS Jagan to lay the foundation for Greenko Energies Ltd at Gummitham Tanda in Kurnool. ఈ నెల 17న కర్నూలు జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప‌ర్య‌టించ‌నున్నారు.

By Medi Samrat  Published on  15 May 2022 3:33 PM IST
17న క‌ర్నూల్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న సీఎం జ‌గ‌న్

ఈ నెల 17న కర్నూలు జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప‌ర్య‌టించ‌నున్నారు. ఆ రోజు ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లిలోని మజరా గ్రామం గుమ్మటం తండాలో పర్యటించనున్నారు. రూ.1500 కోట్ల పెట్టుబడితో.. 5,410 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా.. గ్రీన్ కో ఎనర్జీస్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో సీఎం పర్యటనకు జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.

షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఉదయం 9.35 గంటలకు విజయవాడలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి 10 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్‌కు బయలుదేరి వెళతారు. అక్క‌డి నుండి ముఖ్యమంత్రి గుమ్మటం తండాకు చేరుకుని 11.15 నుంచి 11.30 గంటల మధ్య స్థానిక నేతలతో స‌మావేశ‌మ‌వుతారు. 11.35 గంటలకు ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని 11.35 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంత‌రం మధ్యాహ్నం 12.40 గంటలకు విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళతారు.















Next Story