పవన్‌కల్యాణ్‌ కుమారుడికి ప్రమాదంపై జగన్ రియాక్షన్ ఇదే

ఏపీ మాజీ సీఎం జగన్ కూడా ఆ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించారు.

By Knakam Karthik
Published on : 8 April 2025 1:11 PM IST

Andrapradesh, Ys Jagan, Pawan Kalyan,  Mark Shankar

పవన్‌కల్యాణ్‌ కుమారుడికి ప్రమాదంపై జగన్ రియాక్షన్ ఇదే

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ మాజీ సీఎం జగన్ కూడా ఆ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించారు. సింగపూర్‌లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలిసి నేను షాక్ అయ్యాను, అందులో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి దైర్యం చేకూరాలని, ఆ చిన్నారి త్వరగా.. పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను..అని జగన్ రాసుకొచ్చారు.

కాగా సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ సింగపూర్ కు బయలుదేరారు. పవన్ ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్నారు. గాయపడిన మార్క్ శంకర్ కు సింగపూర్ లో చికిత్స అందిస్తున్నారు. కాగా పవన్ కుమారుడు అగ్నిప్రమాదంలో గాయపడటం పై సినిమా ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. 8 ఏళ్ల మార్క్‌ శంకర్‌ ప్రస్తుతం బాగానే ఉన్నాడు.. కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి తెలిపారు.

Next Story