వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పులివెందుల చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి నేరుగా తన క్యాంప్ ఆఫీస్‌కి చేరుకున్న ఆయన ప్రజలు, కార్యకర్తల నుంచి సమస్యలను తెలుసుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్ మూడు రోజులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తన పర్యటనలో భాగంగా అరటి పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు.
మంగళవారం సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ పులివెందుల చేరుకుని క్యాంప్ ఆఫీస్‌లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. బుధవారం ఉదయం 9 గంటలకు పులివెందుల వాసవి ఫంక్షన్ హాల్‌లో జరిగే వివాహానికి జగన్ హాజరవుతారు. అక్కడి నుంచి బ్రహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. పర్యటన ముగించుకుని 27వ తేదీన పులివెందుల నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు.