వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. డిసెంబర్ 24 నుంచి నాలుగు రోజుల పాటు పులివెందులలో పర్యటించబోతున్నారు. డిసెంబరు 24న ఆయన పులివెందులకు చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ప్రేయర్ హాల్‌లో జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కడప నియోజకవర్గ నాయకులతో సమావేశమవుతారు.
25వ తేదీన సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం తాతిరెడ్డిపల్లిలో ఓ కార్యక్రమానికి హాజరవుతారు. 26న పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 27వ తేదీన పులివెందులలో ఓ వివాహ వేడుకకు హాజరవుతారు. ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరగనున్న వివాహానికి హాజరవుతారు, అనంతరం బెంగళూరు బయల్దేరి వెళతారు.