వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటనకు పులివెందులకు చేరుకున్నారు. నేడు, రేపు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈ రోజు స్థానిక ప్రజలు, నాయకులను వైఎస్ జగన్ కలవనున్నారు. జులై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు వైఎస్ జగన్. తన క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారు.
ఇక జులై 9న వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనపై ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు స్వయంగా బంగారుపాళ్యం వెళ్తున్నారు.