కొత్త జీఎస్టీ శ్లాబులపై వైఎస్ జగన్ ప్రశంసలు

దేశవ్యాప్తంగా నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ శ్లాబులపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు.

By -  Medi Samrat
Published on : 22 Sept 2025 7:10 PM IST

కొత్త జీఎస్టీ శ్లాబులపై వైఎస్ జగన్ ప్రశంసలు

దేశవ్యాప్తంగా నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ శ్లాబులపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. జీఎస్టీలో చేపట్టిన క్రమబద్ధీకరణను ఆయన స్వాగతించారు. సరళమైన, న్యాయమైన పన్నుల వ్యవస్థను రూపొందించే దిశగా ఇది ఒక విప్లవాత్మక అడుగు అని ఆయన అభివర్ణించారు. ఈ కొత్త విధానం వల్ల వస్తువులు, సేవలు ప్రతి పౌరుడికి మరింత సులభంగా, అందుబాటు ధరల్లో లభించేందుకు మార్గం సుగమం అవుతుందని జగన్ తెలిపారు.

జీఎస్టీ పునర్నిర్మాణం సరళమైన, న్యాయమైన పన్ను వ్యవస్థ వైపు ఒక విప్లవాత్మక అడుగు. వస్తువులు, సేవలను ప్రతి పౌరుడికి మరింత సరళంగా, సరసమైనదిగా మార్చడానికి ఈ చర్యలు ఎంతో తోడ్పడతాయని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. అమలు ప్రక్రియలో తొలినాళ్లలో కొన్ని ఫిర్యాదులు, నిర్వహణలో లోపాలు ఉండవచ్చని అభిప్రాయపడుతూనే, ఇదొక నిరంతర ప్రక్రియ అని జగన్ జగన్ అన్నారు. ఇది కచ్చితంగా ఆర్థిక వ్యవస్థలో వినియోగానికి, మరింత పెట్టుబడులకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందని వైఎస్ జగన్ పోస్టు పెట్టారు.

Next Story