పోసాని కృష్ణమురళి అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఖండించారు. పోసాని భార్య కుసుమలతను ఫోన్‌లో పరామర్శించిన వైఎస్ జగన్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రజలు, దేవుడు అంతా చూస్తున్నారు. పోసాని కృష్ణమురళికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని తెలిపారు. పార్టీ తరఫున న్యాయ సహాయం అందిస్తామని, సీనియర్ న్యాయవాదులకు ఆ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. పొన్నవోలు సహా అందరినీ రాజంపేటకు పంపించామని, ఈ కష్టకాలంలో మీరు ధైర్యంగా ఉండాలని వైఎస్ జగన్ తెలిపారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా పోసాని పని చేశారు. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు పోసానిపై కేసు నమోదైందని చెబుతూ అరెస్టు చేశారు.