వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓ బుక్ పెడతామని ప్రకటించారు. మంగళగిరి వైసీపీ నేతలు, కార్యకర్తలతో జగన్ భేటీ అయ్యారు. గ్రామ, వార్డు స్థాయిలో ఉన్న వైయస్ఆర్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను ఏకతాటిపైకి తీసుకురావాలని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఢీ అంటే ఢీ అనేలా ఉండాలన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలుంటాయని, ఆ కష్టాల్లో నుంచే నాయకులు పుడతారన్నారు. రెడ్ బుక్ పెట్టడం పెద్ద పనికాదని, మనం గుడ్ బుక్ పెడదామని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. రెడ్‌బుక్ ఏమైనా పెద్దపనా? మా వాళ్లు కూడా బుక్స్ మెయింటెన్ చేయడం మొదలుపెడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. తాము గుడ్‌బుక్ రాసుకోవడం మొదలు పెట్టామని, పార్టీ కోసం కష్టపడే వారి పేర్లను అందులో రాసుకుంటున్నామన్నారు. వారికి తప్పకుండా మంచి అవకాశాలు ఉంటాయని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగంతో వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, వారికి భరోసా ఇచ్చి, పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలన్నారు.