చిన్నారికి ఖరీదైన పెన్ను బహుమతిగా ఇచ్చిన సీఎం జగన్

YS Jagan gifts eight-month old his costly pen in Konaseema. కోనసీమలోని లంక గ్రామాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన

By Medi Samrat  Published on  26 July 2022 8:15 PM IST
చిన్నారికి ఖరీదైన పెన్ను బహుమతిగా ఇచ్చిన సీఎం జగన్

కోనసీమలోని లంక గ్రామాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వరద బాధితులను పరామర్శించిన సీఎం జగన్.. 8 నెలల చిన్నారిని చేతుల్లోకి తీసుకుని ఎత్తుకోగా జేబులోంచి పెన్ను తీసుకుంది. జేబులోంచి తీసే క్రమంలో పెన్ను కింద పడింది. అనంతరం సీఎం జగన్ ఆ ఖరీదైన పెన్ను చిన్నారికి బహుమతిగా ఇచ్చారు. దీంతో ఎనిమిది నెలల చిన్నారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. పెదపూడి లంక గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరద నష్టంపై అంచనాలు పూర్తి చేసిన వెంటనే సాయం చేస్తామని స్పష్టం చేశారు. ఏ సీజన్‌లో నష్టం జరిగిందో అదే సీజన్‌లో పరిహారం అందజేస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ఊదుమూడి లంకలోని పుచ్చకాయలవారి పేటలో వరద బాధితులను ఆయన పరామర్శించారు.


Next Story