వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌యార్డును సందర్శించారు. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానన్నారు. జగన్ వస్తున్నాడని తెలిసి, ఇక్కడ 2 వేల మంది పోలీసులను మొహరించి, రైతులను రానీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కేవలం 500 మంది మాత్రమే రావాలని ఆంక్షలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. మా ప్రభుత్వ హయాంలో కిలో మామిడి రూ.29 కి కొంటే, ఇప్పుడు కనీసం రూ.12 కూడా రావడం లేదు. ఇంకా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందడం లేదన్నారు.
ఆనాడు ఆర్బీకే వ్యవస్థ ప్రతి అడుగులో రైతులకు తోడుగా ఉండేవి. కానీ, ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీరం చేసిందని, ఇవాళ అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని వైఎస్ జగన్ ఆరోపించారు. దాదాపు 1200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారని, ఇక్కడ ఒకరి తల పగలగొట్టారన్నారు వైఎస్ జగన్. అసలు మీరు మనుషులేనా? ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్ పలుకుతున్నాడు. మిర్చి, పొగాకు, మామిడి రైతుల సమస్యలపై జగన్ మాత్రమే మాట్లాడుతున్నాడని వైఎస్ జగన్ అన్నారు.