నేనే వచ్చి ధర్నా చేస్తా: వైఎస్ జగన్

అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు

By Medi Samrat  Published on  23 Aug 2024 2:15 PM IST
నేనే వచ్చి ధర్నా చేస్తా: వైఎస్ జగన్

అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడారు. అచ్యుతాపురం ఘటన బాధాకరమని వైఎస్ జగన్ అన్నారు. సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ తనకు బాధను కలిగించిందని జగన్ అన్నారు. ఇష్యూని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారన్నారు. పరిశ్రమలపై ప్రభుత్వం పర్యవేక్షణ చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికే ఈ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకూడదన్న తాపత్రయం కనిపించిందని.. ఘటనా స్థలానికి ఆంబులెన్సులు కూడా రాని పరిస్థితి నెలకొందన్నారు.

ఫార్మా కంపెనీలో పట్టపగలు ప్రమాదం జరిగినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కార్మికశాఖ మంత్రి దగ్గర కూడా వివరాలు లేవని విమర్శించారు. బాధితులకు, మృతుల కుటుంబాలకు పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. పరిహారం ఇవ్వకపోతే తానే వచ్చి స్వయంగా ధర్నా చేస్తానని హెచ్చరించారు. బాధితులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Next Story