చంద్రబాబు, పవన్, లోకేష్ చేసిన తప్పులకు లెంపలేసుకోవాలి : వైఎస్ జగన్
మూడేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
By - Medi Samrat |
మూడేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మాజీ మంత్రి అంబటిని స్టేషన్‌లో నల్లపాడు, పట్టాభిపురం సీఐలు దారుణంగా కొట్టారన్నారు వైఎస్ జగన్. వచ్చేది తమ ప్రభుత్వమేనని, అన్నింటిపై ఎంక్వైరీలు వేస్తాం.. వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. మా ప్రభుత్వం వచ్చాక అన్ని లెక్కలు తేలుస్తాం, విషపూరిత విత్తనాలు నాటడం ఆపండన్నారు. చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చండి. దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు వైఎస్ జగన్. మేం భయపడతామనుకుంటే చంద్రబాబు ముర్ఖుడే. వైఎస్సార్‌సీపీ శ్రేణులు నాలుగింతలు రెచ్చిపోయి కూటమి ప్రభుత్వాన్ని పెకిలిస్తారని వైఎస్ జగన్ హెచ్చరించారు. బిహార్ సంగతేమో కానీ.. ఏపీలో మాత్రం జంగల్ రాజ్ నడుస్తోంది. తప్పు చేసిన అధికారుల్ని ఆధారాలతో సహా కోర్టులో నిలబెడతామని వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు.
అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడుపై దాడులు అత్యంత హేయం, వీళ్లందరూ చేసిన తప్పేంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. కుట్రపూరితంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేస్తున్నారు. తిరుమల ప్రతిష్టతను చంద్రబాబు దెబ్బతీస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు దుష్ప్రచారంచేస్తున్నారు. దేవుడంటే చంద్రబాబుకు భక్తి, భయం లేదు. కేంద్రానికి సంబంధించిన ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్ ల్యాబ్‌లే. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని రిపోర్టులు ఇచ్చాయి. సీబీఐ ఆధ్వర్యంలో ఈ శాంపిల్స్ అన్నీ టెస్ట్‌లు జరిగాయని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ చేసిన తప్పులకు లెంపలేసుకోవాలి. సీబీఐ స్పష్టం చేసినా మళ్లీ గోబెల్స్ ప్రచారానికి దిగారు. కుల, మతాలను రెచ్చగొట్టేలా దుష్ప్రచారం చేస్తున్నారు. మళ్లీ మళ్లీ అబద్ధాలు చెప్తూనే ఫ్లైక్సీలు పెడుతున్నారు. చంద్రబాబును ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారన్నారు.