ఆ 20 మంది ఏమైపోయారు.. ప్ర‌భుత్వంపై జ‌గ‌న్ ఆగ్ర‌హం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామికమైన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని వైఎస్ జగన్ అన్నారు.

By Medi Samrat
Published on : 12 July 2025 12:15 PM IST

ఆ 20 మంది ఏమైపోయారు.. ప్ర‌భుత్వంపై జ‌గ‌న్ ఆగ్ర‌హం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామికమైన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు నిరంకుశ పాలనలో ప్రజల హక్కులు అణచివేయబడుతున్నాయని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

చట్టానికి లోబడి నిరసనలు తెలిపినా అక్రమ కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందని, గుంటూరు మిర్చియార్డులో రైతుల పరామర్శకు వెళ్లినప్పుడు ఒక కేసు పెట్టారు, రామగిరిలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై కేసు పెట్టారని, పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళితే మూడు కేసులు పెట్టి 15 మందిని అరెస్ట్ చేశారన్నారు. సినిమా పోస్టర్ ప్రదర్శించిన యువకుడిని జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి వెళితే ఐదు కేసులు పెట్టి 20 మందిని కస్టడీలోకి తీసుకున్నారని జగన్ మండిపడ్డారు. వారిని అరెస్ట్ చేసినట్టు చూపించలేదని, కోర్టులో హాజరుపరచలేదన్నారు.


Next Story