చంద్రబాబు హయాంలో మత్స్యకారులను విస్మరించారని.. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో నాల్గవ వార్షిక 'వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో మత్స్యకారుల కష్టాలను చూశానని, వరుసగా నాలుగో సంవత్సరం మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.
మత్స్యకార భరోసా పథకం కింద 1,08,755 మంది మత్స్యకారులకు రూ.109 కోట్లు జమ చేస్తూ ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్నామని.. దీని ద్వారా మత్స్యకార భరోసా పథకం కింద ఇప్పటివరకు రూ.418 కోట్లు అందించామని వైఎస్ జగన్ తెలిపారు. ఒఎన్‌జిసి పైప్‌లైన్ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు పరిహారం అందజేశామన్నారు. జీవనోపాధి కోల్పోయిన 69 గ్రామాల మత్స్యకార కుటుంబాలకు ఒఎన్ జిసి ద్వారా ఒక్కొక్కరికి రూ.11,500 చొప్పున 4 నెలల పాటు రూ.108 కోట్ల పరిహారం అందిస్తున్నామని జగన్ తెలిపారు. గత ప్రభుత్వం రూ.70 కోట్లు బకాయిలు చెల్లించిందన్నారు.
అధికారంలోకి వస్తే ఏం చేస్తానో మాట్లాడే దమ్ము చంద్రబాబుకు లేదని వైఎస్ జగన్‌పై మండిపడ్డారు. ''ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని జీర్ణించుకోలేక ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఓ వర్గం మీడియాతో పోరాడుతున్నామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.