మాస్ట‌ర్స్‌ ప‌ట్టా అందుకున్న‌ జ‌గ‌న్ త‌న‌య‌

YS Jagan daughter Harshini Reddy Completes her masters. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూతురు వైఎస్ హ‌ర్షిణి రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు.

By Medi Samrat  Published on  2 July 2022 2:18 PM GMT
మాస్ట‌ర్స్‌ ప‌ట్టా అందుకున్న‌ జ‌గ‌న్ త‌న‌య‌

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూతురు వైఎస్ హ‌ర్షిణి రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె మాస్ట‌ర్స్‌లో పట్టా అందుకున్నారు. ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్‌కు చెందిన వ‌ర్సిటీలో మాస్ట‌ర్స్ విద్య‌న‌భ్య‌సించిన హ‌ర్షిణి శ‌నివారం మాస్ట‌ర్స్ ప‌ట్టా అందుకున్నారు. మాస్ట‌ర్స్‌లో ఆమె డిస్టింక్ష‌న్‌తో స‌త్తా చాటారు. వ‌ర్సిటీ నుంచి హ‌ర్షిణి రెడ్డి ప‌ట్టా తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురు మాస్ట‌ర్స్ పూర్తి చేసి ప‌ట్టా పుచ్చుకునే కార్య‌క్ర‌మం(స్నాతకోత్స‌వం)లో పాలుపంచుకునేందుకు ఇప్ప‌టికే జ‌గ‌న్ దంప‌తులు పారిస్ వెళ్లారు. త‌ల్లిదండ్రుల స‌మ‌క్షంలోనే హ‌ర్షిణి రెడ్డి ప‌ట్టా తీసుకున్నారు.

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీ పూర్తి చేయ‌డం పట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. డియ‌ర్ హ‌ర్షా చాలా గ‌ర్వంగా ఉంది అంటూ ఆయ‌న స‌ద‌రు పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. నీవు ఎదిగిన తీరు అమిత సంతోషాన్నిచ్చింద‌ని.. దేవుడు నీ ప‌ట్ల కృప చూపించాడ‌ని పేర్కొన్నారు. ఈ రోజు ఇన్‌సీడ్ నుంచి డిస్టింక్ష‌న్‌తో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేయ‌డం గర్వంగా ఉంద‌ని.. డిస్టింక్ష‌న్‌తో పాటు డీన్స్ జాబితాలోనూ చోటు సంపాదించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ప‌ట్టా అందుకున్న కూతురుతో క‌లిసి జ‌గ‌న్ దంప‌తులు ఫొటో దిగారు. ఈ ఫొటోను జ‌గ‌న్ త‌న ట్వీట్‌కు జ‌త చేశారు.


Next Story
Share it