నందమూరి బాలకృష్ణపై వైఎస్ జగన్ కౌంటర్లు

కొద్దిరోజుల కిందట అసెంబ్లీలో వైఎస్ జగన్‌ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ.

By -  Medi Samrat
Published on : 23 Oct 2025 5:30 PM IST

నందమూరి బాలకృష్ణపై వైఎస్ జగన్ కౌంటర్లు

కొద్దిరోజుల కిందట అసెంబ్లీలో వైఎస్ జగన్‌ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఈ వ్యాఖ్యలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా స్పందించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ తాగి వచ్చి అసెంబ్లీలో అసందర్భ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. బాలకృష్ణ తాగి అసెంబ్లీ వస్తే స్పీకర్ ఎలా అనుమతించారని ప్రశ్నించారు. బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో అందరికీ తెలుసని అన్నారు.

అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటి? పనిపాట లేని సంభాషణ చేశారు. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారన్నారు వైఎస్ జగన్. అలా మాట్లాడినందుకు సైకలాజికల్‌ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలని జగన్‌ అన్నారు.

Next Story