మోసాలు బయటపడతాయనే జాప్యం చేశారు : జగన్
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు.
By Medi Samrat Published on 13 Nov 2024 7:57 PM ISTకూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా, ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారని, బడ్జెట్ ప్రవేశపెడితే మోసాలు బయటపడతాయని ఇన్ని నెలలు జాప్యం చేశారని జగన్ ఆరోపించారు. ఈ బడ్జెట్ పత్రాలు చూస్తే చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అనే విషయం అర్థమవుతుందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఏపీ అప్పుల్లో శ్రీలంకను మించిపోతోందని తప్పుడు ప్రచారం చేశారని, ఇదే అంశాన్ని దత్తపుత్రుడితోనూ మాట్లాడించారని జగన్ అన్నారు. ఎన్నికల ముంగిట రాష్ట్రం అప్పులు రూ.14 లక్షల కోట్లు అని ప్రచారం చేశారని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అవే అబద్ధాలను గవర్నర్ తో కూడా చెప్పించారన్నారు.
2019లో అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రం అప్పులు రూ.3.13 లక్షల కోట్లు. 2024లో మేం అధికారం నుంచి దిగిపోయే నాటికి అప్పులు రూ.6.46 లక్షల కోట్లని, చంద్రబాబు హయాంలో అప్పులు 19 శాతం పెరిగితే తమ హయాంలో పెరిగిన అప్పుల శాతం 15 మాత్రమే అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పుడు కూడా అబద్ధాలు చెబుతుండడం చూస్తుంటే సూపర్ సిక్స్ హామీలకు ఎగనామం పెట్టేట్టున్నాడని జగన్ ఆరోపించారు.