వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గోరంట్ల మండలం కల్లితండాలో పర్యటించారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు.
దేశం కోసం పోరాడుతూ, మురళీనాయక్ వీరమరణం పొందారని మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు వైఎస్ జగన్. మురళీనాయక్ అందరికీ స్ఫూర్తిదాయకమని,మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానన్నారు. మురళీనాయక్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ తరఫున 25 లక్షలు సాయం అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా మురళీ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.