'వకీల్ సాబ్' సినిమా చూస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. తెనాలిలోని లక్ష్మి డీలక్స్ హాల్‌లో ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. సినిమా చూస్తున్న వారు థియేటర్ సిబ్బందికి తెలపగా.. అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడిని పరిశీలించిన డాక్టర్లు అప్ప‌టికే మృతి చెందినట్టు తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడికి సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నారు.

ఇదిలావుంటే.. వ‌కీల్ సాబ్‌ విడుదలైన మూడు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించింది. దీంతో ఫిల్మ్ యూనిట్ చాలా సంతోషంగా ఉంది. మరింత మంది దృష్టిని ఆకర్షించేందుకు నిర్మాతలు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. అధికారిక కలెక్షన్ వివరాలను ఇవ్వకూడదని నిర్మాతలు నిర్ణయించునుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో రూ. 90 కోట్లకు పైగా వసూలు చేసిందని టాక్ వినిపిస్తోంది. రూ. 100 కోట్ల మార్కును చేరుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం యుఎస్‌ఎలో కూడా బాగానే కలెక్షన్స్ రాబడుతోంది.


సామ్రాట్

Next Story