వామపక్షాలతో కలుస్తాం: ఎంపీ విజయసాయిరెడ్డి

YCP Tie With Communist To Fight For Visakha Steels. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై ఎంపీ విజయసాయిరెడ్డి వామపక్షాలతో కలుస్తాం.

By Medi Samrat
Published on : 10 Feb 2021 7:54 AM

YCP Tie With Communist To Fight For Visakha Steels
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చాలా దారుణమన్నారు. ప్రైవేటీకరణను వైసిపి చాలా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. కార్మిక హక్కులు కాపాడేందుకు ఉద్యమం చేద్దామని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. భూములను తాము దోచుకోవాలని చూస్తున్నామని కొంతమంది అంటున్నారన్న విజయసాయిరెడ్డి.. తమది పేదల పార్టీ, ధనికుల పార్టీ కాదని అన్నారు.


వామపక్షాలతో కలిసి ఉక్కు ఉద్యమంలో పోరాడతామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఎలాంటి అపోహలు అవసరం లేదని భరోసా ఇస్తున్నామన్నారు. ఉద్దేశపూర్వకంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నష్టాల్లోకి నెట్టారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించలేదన్న ఎంపీ.. ప్రైవేటుకు కట్టబెట్టాలనే కుట్రలో భాగంగా చేశారని అన్నారు. సీఎం అనుమతి తీసుకుని కార్మిక సంఘాల నిరాహార దీక్షలో పాల్గొంటామని తెలిపారు. కార్మిక సంఘాల నాయకులను ఢిల్లీ తీసుకెళ్లి కేంద్ర పెద్దలను కలిపిస్తామని అన్నారు.




Next Story