వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందేందుకు అవసరమైన మెజారిటీ లేకున్నా 23 ఓట్లతో విజయం సాధించారు. దీంతో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు తేలిపోయిందని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొన్నారని.. మాకున్న సమాచారం మేరకు డబ్బులు చేతులు మారినట్లు పార్టీ విశ్వసిస్తోందని అన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఒక్కోక్కొరికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లకు చంద్రబాబు ఆఫర్ చేశారని ఆరోపించారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించినందుకు గానూ.. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకుగానూ ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై వేటు వేస్తున్నట్లు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు.