కూటమి నేతలైతే ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేయొచ్చా?: శ్యామల
కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారయత్నం ఘటన అంశంపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పందించారు.
By - Knakam Karthik |
కూటమి నేతలైతే ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేయొచ్చా?: శ్యామల
కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారయత్నం ఘటన అంశంపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పందించారు. ఈ మేరకు ఆమె వీడియో సందేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. కూటమి నేతలైతే ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేయొచ్చా? అని శ్యామల ప్రశ్నించారు. తునిలో టీడీపీ నాయకుడు నారాయణ రావు.. తుని రూరల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను తోటలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ఈ దారుణాన్ని అడ్డుకున్న స్థానికుడిపై నేను టీడీపీ కౌన్సిలర్‌ను అంటూ బెదిరించడం చూశాం. మీరు కూటమి నేతలైతే మాత్రం తప్పు.. ఒప్పు అయిపోతుందా?..అని ఎద్దేవా చేశారు.
కూటమి నేతలైతే తప్పు ఒప్పు అవుతుందా? కూటమి నేతలైతే రాష్ట్రంలో మహిళలతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారా? కల్లబొల్లి హామీలిచ్చి మహిళలకు రక్షిస్తామంటూ మాట్లాడిన నేతలు ఇప్పుడెందుకు మాట్లాడరు? ఈ రోజు తుని సంఘటన కూటమి ప్రభుత్వానికి మాయని మచ్చ. ఇలాంటి నేరస్థులందరికీ కూటమి ప్రభుత్వం చేతులచ్చి, గొడుగు పడుతుంది. రాష్ట్రంలో మహిళల భద్రత కూటమి ప్రభుత్వంలో బందీ అయిపోయింది. ఇంకెంత మంది మహిళలకు అన్యాయం జరిగితే కూటమి నేతలు ముందుకొచ్చి ప్రశ్నిస్తారు? ప్రశ్నిస్తానన్న పెద్ద మనిషి షూటింగ్‌లు, మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు..అని శ్యామల ఆరోపించారు.
🚨 #RapistsPartyTDPకూటమి నేతలైతే ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేయొచ్చా? తునిలో టీడీపీ నాయకుడు నారాయణ రావు.. తుని రూరల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను తోటలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు ఈ దారుణాన్ని అడ్డుకున్న స్థానికుడిపై నేను టీడీపీ కౌన్సిలర్‌ను అంటూ… pic.twitter.com/25VYgmjQnW
— YSR Congress Party (@YSRCParty) October 22, 2025