పట్టాభికి బాబు నుంచి ప్రాణభయం.. అందుకే అక్కడికి పారి పోయాడు.!
YCP MP Vijayasaireddy latest comments. చంద్రబాబుకు భయపడి పట్టాభి మాల్దీవులకు పారిపోయాడని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు స్వార్థపరుడని.
By అంజి Published on 27 Oct 2021 4:38 PM ISTచంద్రబాబుకు భయపడి పట్టాభి మాల్దీవులకు పారిపోయాడని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు స్వార్థపరుడని.. పట్టాభిని భౌతికంగా ఎలిమినేట్ చేసి, దానిఇన వైసీపీ మీద రుద్దగలిగే చాకచక్యం ఉన్న వ్యక్తని విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. మోసం, దగా అన్నది చంద్రబాబుకు పుట్టుకతో వచ్చిన విద్య అంటూ విరుచుకుపడ్డారు. పట్టాభికి చంద్రబాబు గురించి బాగా తెలుసు కాబట్టి, వైసీపీకి భయపడి కాదు, ఎక్కడ తన ప్రాణాలకు హాని కలుగుతుందనే భయంతో పట్టాభి మాల్దీవులకు పారిపోయాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు. "బోషడీకే" అనే బూతు పదాన్ని పట్టాభి ఒకసారి కాదు.. 5 సార్లు ఉచ్ఛరించాడంటే కచ్చితంగా చంద్రబాబు అనుమతితోనే మాట్లాడానని అనుమానం వ్యక్తం చేశారు. పట్టాభి పెద్ద రాజకీయ నాయకుడు కాదని, అతను ఎవరికీ కూడా తెలియని వ్యక్తి అని విజయసాయిరెడ్డి అన్నారు.
సీఎం మీద చంద్రబాబే ఈ తరహా అసభ్యకరమైన భాష వాడించారని అన్నారు. "తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, యూపీలకు వెళ్లి ఈ రతహా భాష వాడితే.. మీకు ఏ శాస్తి జరుగుతుందో మీరు చూస్తారని, అప్పుడే ఆ పదం యొక్క సీరియస్ నెస్ చంద్రబాబుకు అర్థమవుతుందని" విజయసాయిరెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లి బాబుకు అపాయింట్‌మెంట్లు దొరకలేదని, అందరూ మొహం మీదే తలుపులు ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఏ ఎన్నికల్లోనూ గెలవలేని బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయమంటున్నాడని, చంద్రబాబు ఉగ్రవాది.. అసాంఘీక శక్తులకు రారాజు అంటూ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో చంద్రబాబే మాదక ద్రవ్యాల వ్యాపారం చేశాడని, గంజాయి వ్యాపారంలో లోకేష్ పాత్ర ఉందని విజయసాయి ఆరోపించారు. చంద్రబాబు ట్రూ కలర్స్ తెలిసి, ఏ పార్టీ వాళ్లూ, కేంద్ర పెద్దలు బాబును కలిసేందుకు ఇష్టపడటం లేదన్నారు.