పురంధేశ్వరి లెక్కలకు.. విజయసాయి కౌంటర్
YCP MP Vijaya Sai Reddy Counter To Bjp Ap President.
By Medi Samrat Published on 2 Aug 2023 4:45 PM ISTఏపీ అప్పులపై పార్లమెంటులో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటనపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. రాష్ట్రానికి నాలుగేళ్లలో వచ్చిన రూ.15లక్షల కోట్ల ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. పార్లమెంటులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్‌బీఐ ఇచ్చిన రుణాల గురించి మాత్రమే చెప్పారని, అనధికారంగా తీసుకున్నవి కలిపితే రాష్ట్ర అప్పు మొత్తం రూ.10.77 కోట్లు ఉంటుందని పురందేశ్వరి అన్నారు. రిజర్వు బ్యాంకుకు చూపించిన రూ.15 లక్షల కోట్ల ఆదాయం ఎలా వచ్చిందనే విషయంపై ప్రజలకు వివరణ ఇవ్వాలని పురందేశ్వరి ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్మలా సీతారామన్ రిజర్వు బ్యాంకు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాల గురించి మాత్రమే పార్లమెంటులో సమాధానం చెప్పారని, తాను అనధికారంగా చేసిన అప్పులు గురించి కూడా చెప్పానని వివరించారు.
పురందేశ్వరి వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏపీకి నాలుగేళ్లలో ఒక్క పరిశ్రమ రాలేదంటూ గాలి మాటలెందుకని బదులిచ్చారు. పార్లమెంటులో ఆర్థికమంత్రి స్వయంగా ప్రకటించినా గానీ, చెల్లెమ్మ పురందేశ్వరి ఏవో కాకి లెక్కలు చెబుతోందని విమర్శించారు. ఈ నాలుగేళ్లలో మీరు ఒక్కసారి కూడా రాష్ట్రానికి రాలేదన్నది వాస్తవం. బావ కళ్లలో ఆనందం కోసం కాదమ్మా... ప్రస్తుతం ఉన్న పార్టీ కోసం పనిచేయొచ్చు కదా! అని విజయసాయి సెటైర్లు వేశారు.