వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్.. కారణం ఇదే..!

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి వియవాడ ఏసీబీ కోర్టులో ఊరట లభించింది.

By Medi Samrat
Published on : 6 Sept 2025 2:24 PM IST

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్.. కారణం ఇదే..!

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి వియవాడ ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. ఆయనకు ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లోక్ సభ సభ్యుడినైన తాను ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉందని తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబర్ 11న తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది.

మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారు. లిక్కర్ స్కాంలో అరెస్టైన మిథున్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు రెగ్యులర్ బెయిల్‌‌ కోసం మిథున్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది.

Next Story