ఒరిజినల్ వీడియో నా దగ్గర ఉంది.. పోలీసులు అడిగితే ఇస్తా: ఎంపీ గోరంట్ల

YCP MP Gorantla Madhav's sensational comments on the video controversy. ఏపీలో న్యూడ్‌ వీడియో వైరల్‌పై వివాదం కొనసాగుతూనే ఉంది. ఎంపీ గోరంట్ల మాధవ్‌ అంటూ ప్రచారం సాగుతున్న వీడియో

By అంజి  Published on  14 Aug 2022 2:29 PM IST
ఒరిజినల్ వీడియో నా దగ్గర ఉంది.. పోలీసులు అడిగితే ఇస్తా: ఎంపీ గోరంట్ల

ఏపీలో న్యూడ్‌ వీడియో వైరల్‌పై వివాదం కొనసాగుతూనే ఉంది. ఎంపీ గోరంట్ల మాధవ్‌ అంటూ ప్రచారం సాగుతున్న వీడియో.. ఒరిజినల్‌ అని యూఎస్‌ఏ ల్యాబ్‌లో నిర్దారణ అయ్యిందని టీడీపీ నేతలు చెప్పారు. ఈ విషయమై స్పందించిన వైసీపీ ఎంపీ గోరంట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేక్‌ వీడియోపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. ఒరిజినల్‌ వీడియో తన ఫోన్‌లో ఉందని వ్యాఖ్యానించారు. పోలీసులు అడిగితే తన ఫోన్‌ ఇస్తానని, అలాగే చంద్రబాబు ఓటుకు నోటు కేసు వీడియోను అమెరికా ల్యాబ్‌లో టెస్ట్‌ చేయించాలని డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు వీడియోను టిడిపి నేతలు అమెరికా ల్యాబ్‌లో టెస్ట్ చేయించ గలరా.? అంటూ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు వీడియోను స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపితే తాను సిద్ధమేనని సవాల్‌ విసిరారు. వీడియోపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. పోలీసు వ్యవస్థ తన కోసం సృష్టించలేదని, వారిని స్వతంత్రంగా దర్యాప్తు చేయనీయండన్నారు. బీసీలపై కత్తిపెట్టి అణగదొక్కుతున్నారు, అందుకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్‌ అవుతున్నారు.

తనపై టీడీపీ నేతలు కుట్రపూరితంగా ఫేక్‌ వీడియోలు క్రియేట్‌ చేశారన్నారు. ఐటీడీపీ సోషల్‌మీడియా ద్వారా యూకే నుంచి ఫేక్‌ వీడియోలను పంపారని, ఈ వీడియోలను ఎల్లో మీడియా ప్రసారం చేసిందన్నారు. రాష్ట్ర పోలీస్‌ వ్యవస్థ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.

Next Story