గుండెపోటుతో వైసీపీ ఎమ్మెల్సీ కరీమున్నీసా మృతి

YCP MLC Karimunnia passes away.వైసీపీలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Nov 2021 3:00 AM GMT
గుండెపోటుతో వైసీపీ ఎమ్మెల్సీ కరీమున్నీసా మృతి

వైసీపీలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండీ క‌రీమున్నిసా క‌న్నుమూశారు. ఆమె వ‌య‌స్సు 65 సంవ‌త్స‌రాలు. నిన్న అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రైన అనంత‌రం ఇంటికి వ‌చ్చిన ఆమె.. రాత్రి 11.30గంట‌ల స‌మ‌యంలో అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో కుటుంబ స‌భ్యులు వెంట‌నే ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ క‌రీమున్నిసా తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి ప‌ట్ల వైసీపీ నాయకులు సంతాపం ప్ర‌క‌టించారు.

వైసీపీ ఆవిర్భావం నుంచి కరీమున్నీసా పార్టీ కోసం నిరంతరం శ్రమించారు. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఆమెకు సీఎం జగన్‌ అవకాశం కల్పించారు. గ‌తంలో ఆమె విజయవాడ కార్పోరేషన్‌లోని 56వ డివిజన్‌కు కార్పోరేటర్‌గా కూడా పనిచేశారు.

ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణం పట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ప్రతిభావంతమైన నాయకురాలిగా, కార్పొరేటర్ నుంచి మండలి సభ్యురాలిగా ఎదిగిన కరీమున్నీసా మరణం ఊహించనిదన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సీఎం జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Next Story