చంద్రబాబు చేసిన పాపాలకు అంతేలేదు: పేర్ని నాని
YCP MLA Perni Nani counter attack on Chandrababu. 'తనకు ఇదే చివరి అవకాశమని, తాను మళ్లీ పోటీ చేయను' అని చంద్రబాబు తన మనసులోని
By అంజి
'తనకు ఇదే చివరి అవకాశమని, తాను మళ్లీ పోటీ చేయను' అని చంద్రబాబు తన మనసులోని మాటను మరోసారి చెప్పారని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రామోజీరావు ఎన్ని జాకీలు పెట్టి లేపినా చంద్రబాబు లేచే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబుతో ఇదేం ఖర్మ అని జనం అంటున్నారని పేర్ని నాని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు బయట ఎలా ఉన్నాయి? హెరిటేజ్‌లో ఎలా ఉన్నాయి? అని ప్రశ్నించారు. రామోజీ అమ్మే ప్రియ ఆయిల్స్ రేట్లు ఎంత ఉన్నాయన్నారు.
చంద్రబాబు తన కుట్రలతో సీనియర్ ఎన్టీఆర్‌ను క్షోభకు గురి చేశారని పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబు చేసిన పాపాలకు అంతేలేదన్నారు. చంద్రబాబును చంపాల్సిన అవసరం ఎవరికి ఎందుకు అని అన్నారు. బఠానీ గింజంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారేవరైనా చంద్రబాబును మర్డర్ చేయించాలని కోరుకుంటారా అని పేర్ని నాని అన్నారు. మర్డర్ ప్లాన్లు వేయడానికి ఇవి కాంతారావు సినిమా రోజులు కావని చెప్పారు నాని. సంక్షేమ పథకాలపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్టీఆర్ పెట్టిన శాపం చంద్రబాబుకు తగలడం వల్లే చంద్రబాబు ఈ స్థితికి వచ్చరన్నారు. ఎన్టీఆర్‌కి చంద్రబాబు చేసిన ద్రోహానికి ప్రతిఫలం 2024 ఎన్నికల్లో ఇంకా గట్టిగా లభిస్తుందన్నారు. టీడీపీ నేతలు అధికారం కోసం వారు ఎంతకైనా దిగజారతారని, ఎన్నిసార్లయినా మాటలు మారుస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పరిస్థితి డూప్లికేట్ స్వామీజీలాగా ఉందని, అసలు అతనికి మైండ్ ఉందా లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు వైఖరి చూస్తే ప్రజలు ఇదేమి ఖర్మ అనుకుంటున్నారని, జనం ఛీకొడుతున్నా చంద్రబాబుకి సిగ్గు రాలేదని పేర్ని నాని అన్నారు.