జనసేన పార్టీ పెడన బహిరంగ సభపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. జనసేన రాజకీయ పార్టీ కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీ బలహీనపడినప్పుడు బలపడే అవకాశం ఉందని అన్నారు. దాన్ని వినియోగించుకోలేదని అన్నారు.
పెడనలో జనసేన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి జోగి రమేశ్ అన్నారు. పెడనలో అటెన్షన్ ప్లే చేయాలని పవన్ చూశారని, అందుకోసం ప్రయత్నాలు చేశారని, కానీ అది కుదరలేదన్నారు. సినిమా స్టైల్లో తనపై రాళ్ల దాడి జరగబోతుందంటూ డైలాగ్‌లు వదిలారని, తీరా చూస్తే సభనే విఫలమైందన్నారు. టీడీపీ, జనసేన కలిసి కూడా కనీసం రెండువేల మంది జనాన్ని సమీకరించలేకపోయారన్నారు.
పెడన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలహీనపడిందని పవన్ చెప్పారన్నారు. ఎన్డీయే కూటమి నుంచి తాను బయటకు వచ్చినట్లు కూడా చెప్పారన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో పవన్ కళ్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు సజ్జల.