రెండు చెప్పులు చూపించి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ పేర్ని నాని
జనసేనాని పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత, ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. మీడియా సమావేశంలో రెండు చెప్పులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Jun 2023 1:12 PM IST
రెండు చెప్పులు చూపించి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ పేర్ని నాని
జనసేనాని పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత, ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. మీడియా సమావేశంలో రెండు చెప్పులు చూపిస్తూ.. నువ్వు ఒక్క చెప్పు చూపిస్తే నీకంటే పెద్ద మొగోడిని కాబట్టి నేను రెండు చెప్పులు చూపిస్తున్నానని అన్నారు పేర్ని నాని. అంతేకాకుండా మక్కెలిరిగిపోతాయని పవన్ కళ్యాణ్ ను హెచ్చరించారు. గతంలో జనసేన పార్టీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ చెప్పు చూపించి వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు.. దీనికి కౌంటర్ గా పేర్ని నాని రెండు చెప్పులు చూపిస్తూ హెచ్చరించారు.
ఓ వైపు బీజేపీతో పొత్తు పెట్టుకుని అదే సమయంలో టీఆర్ఎస్ కు ఓటేయమని చెప్పారంటూ పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని మండిపడ్డారు. తెలంగాణలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పాట పాడుతూ, ఏపీలోకి రాగానే పవన్ కళ్యాణ్ తెలంగాణ నేతలపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చొక్కా పట్టుకొని పవన్ ఏనాడైనా నిలదీశారా? పవన్ ఆఫీసులో కూర్చొని సినిమా డైలాగ్‌లు, సొల్లు కబుర్లు చెబుతాడన్నారు. పవన్ ఒక చెప్పు చూపిస్తే.. నేను రెండు చెప్పులు చూపిస్తాను.. పవన్‌ను అడ్డం పెట్టి జనసేన పార్టీని చంద్రబాబు నడుపుతున్నారు. చంద్రబాబు, పవన్, బీజేపీ కలిసి ప్రభుత్వం నడిపినప్పుడు సొంత డబ్బు ఖర్చుపెట్టారా? అని ప్రశ్నించారు.
పవన్ ప్రతి సినిమా రిలీజ్ ముందు కేసీఆర్ కాళ్లు మొక్కుతాడు. గులాబీ జెండాను వెనక జేబులో పెట్టుకొని తిరుగుతున్నదెవరు?’’ అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు. హరీష్‌రావు ఆంధ్రరాష్ట్రాన్ని తిడుతుంటే పవన్ ఏం చేస్తున్నారు?. జగన్ సీఎం అయినప్పటి నుంచి పవన్ ఒక్క సినిమా అయినా ఆగిందా? పవన్, బీజేపీ, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సినిమా టికెట్లపై జీఎస్టీ వేసారా? లేదా? అని ప్రశ్నించారు. ఏపీలో తన సినిమాలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలపై పేర్ని నాని స్పందిస్తూ.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పవన్ తీసిన సినిమాలు రెండు మాత్రమేనని, సినిమా బాగుంటే తప్పకుండా ఆడతాయని చెప్పారు.