జగన్‌కు ఉన్న క్రేజ్..హీరోలకు కూడా లేదు: కన్నబాబు
వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik
జగన్‌కు ఉన్న క్రేజ్..హీరోలకు కూడా లేదు: కన్నబాబు
వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం జగన్‌కు ఉన్న క్రేజ్.. సినిమా హీరోలకు కూడా లేదని అన్నారు. ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్‌గా కన్నబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు బాధ్యత అప్పగించిన వైసీపీ అధినేత జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంతంతో నాకు ఎంతో అనుబంధం ఉంది.. అని కన్నబాబు చెప్పారు.
ఈ క్రమంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కూటమి సర్కార్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, ప్రజలను జగన్ మోసం చేయాలంటే..సూపర్ సిక్స్ కాదు, సూపర్ 60 ఇచ్చేవారు అని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి జగన్ అని వ్యాఖ్యానించారు. గ్రూప్-2 అభ్యర్థులను సీఎం చంద్రబాబు మోసం చేశారని కురసాల కన్నబాబు ఆరోపించారు.
ఇక మాజీ సీఎం జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ జన సంద్రమేనని అన్నారు. విజయవాడలో వల్లభనేని వంశీని పరామర్శించడానికి జగన్ వెళ్లినప్పుడు, పాలకొండ పర్యటనలో ఆయన్ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఈ జన ప్రభంజనాన్ని చూసి కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారు. తాము ఓడినా.. పార్టీ చాలా బలంగా ఉంది అని కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు.