'జాగ్రత్త ఏదైనా జరగొచ్చు'.. పవన్‌కు వైసీపీ అలర్ట్‌

పవన్‌ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తే తాను పిఠాపురంలో బరిలోకి దిగుతానన్న టీడీపీ అభ్యర్థి వర్మ కామెంట్లపై వైసీపీ స్పందించింది.

By అంజి  Published on  21 March 2024 1:30 PM IST
YCP, Jana Sena, Pawan Kalyan, APnews

'జాగ్రత్త ఏదైనా జరగొచ్చు'.. పవన్‌కు వైసీపీ అలర్ట్‌

ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురంలో అధికార, ప్రతిపక్ష నాయకుల సవాళ్లు, ప్రతి సవాళ్లతో పరిస్థితులు పూర్తిగా వేడెక్కాయి. పవన్‌ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తే తాను పిఠాపురంలో బరిలోకి దిగుతానన్న టీడీపీ అభ్యర్థి వర్మ కామెంట్లపై వైసీపీ స్పందించింది.

''జాగ్రత్త పవన్.. ఏదన్నా అటూ ఇటూ అయితే పిఠాపురంలో నిన్ను ఓడించేవాళ్లలో మొదటి వరుసలో ఉండేది టీడీపీనే అనుకుంటా.. చూస్కో మరి'' అంటూ వైసీపీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది.

నిన్న టీడీపీ నేత వర్మ సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే, పిఠాపురం అసెంబ్లీ బరిలో తాను పోటీ చేస్తానని అన్నాడు. చంద్రబాబు ఆదేశాలతో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేయాలని పిఠాపురం అసెంబ్లీ బరిలో నుండి తప్పుకున్నానని, ఇప్పుడు పవన్ ఎంపీగా పోటీ చేస్తే గనక పిఠాపురం అసెంబ్లీ బరిలో నిలుస్తానని వర్మ అన్నారు.

మరోవైపు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లోని టీడీపీ చీఫ్‌ చంద్రబాబు ఇంటికి వెళ్లారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు చర్చిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ రెండు విడతల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. జనసేన మరికొంత మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో జనసేన కోరుతున్న స్థానాలపై ఇద్దరూ సమీక్షిస్తున్నారు. త్వరలోనే జనసేన మరో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.

Next Story