టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఆయన్ను తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో శనివారం రాత్రి రాజుపై.. నందిగం సురేశ్, ఆయన సోదరుడు ప్రభు దాసు, బంధువులు దాడి చేశారు. దాడి ఘటనపై రాజు కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు ఉద్దండరాయునిపాలెం వెళ్లి సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో, రాజుపై మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు దాడి చేసి, అతడిని సురేశ్ ఇంటికి బలవంతంగా తీసుకెళ్లినట్టు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ రాజుపై నందిగం సురేశ్, అతడి సోదరుడు ప్రభుదాస్ దాడి చేశారని బాధితుడి భార్య లక్ష్మి తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో తుళ్లూరు పోలీసులు నందిగం సురేశ్ తదితరులపై కేసు నమోదు చేసి, ఇవాళ అతడిని అరెస్ట్ చేశారు. సురేశ్ సోదరుడు ప్రభుదాస్, మరికొందరు బంధువుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, నేడు నందిగం సురేశ్ ను అరెస్ట్ చేయడం పట్ల అతడి భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త అరెస్ట్ ను నిరసిస్తూ తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టింది.