టీటీడీ ప్రక్షాళన అంటే ఇదేనా చంద్రబాబు?: వైసీపీ

తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం ఆకతాయిలకు ఆవాసంగా మారిందని వైసీపీ విమర్శించింది.

By అంజి  Published on  12 July 2024 5:45 AM GMT
YCP, CM Chandrababu,TTD, APnews

టీటీడీ ప్రక్షాళన అంటే ఇదేనా చంద్రబాబు?: వైసీపీ

తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం ఆకతాయిలకు ఆవాసంగా మారిందని వైసీపీ విమర్శించింది. కంపార్ట్‌మెంట్‌లలో ఆకతాయిలు ప్రాంక్‌ చేస్తూ భక్తుల మనోభావాలతో ఆడుకున్న ఘటనపై మండిపడింది. ఇన్ని ఏళ్లలో ఎన్నడూ జరగని విధంగా కొండపై ఇలాంటివి జరుగుతున్నాయంటే.. కూటమి ప్రభుత్వం చేతగానితనం వల్లేనని ప్రజానీకం అంటోందని వైసీపీ ట్వీట్‌ చేసింది. టీటీడీ ప్రక్షాళన అంటే ఇదేనా చంద్రబాబు? అని ప్రశ్నించింది.

ఏం జరిగిందంటే..

తిరుమలలో కొందరు ఆకతాయిలు శ్రీవారి భక్తులతో పరాచకమాడారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దర్శనం కోసం భక్తులు నారాయణగిరి షెడ్లలో వేచిచూస్తున్నారు. ఈ క్రమంలో వారు లోపలికి వచ్చేందుకు గేట్లు తీస్తున్నట్టు తమిళనాడుకు చెందిన టీటీఎఫ్‌ వాసన్‌, ఆయన స్నేహితులు పరాచకమాడారు. ఆ ప్రాంక్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనిపై టీటీడీ విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తామన్నారు. తిరుమలపై ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీని ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Next Story