చంద్ర‌బాబును క‌లిసిన యార్లగడ్డ

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని గ‌న్న‌వ‌రం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు

By Medi Samrat
Published on : 20 Aug 2023 8:15 PM IST

చంద్ర‌బాబును క‌లిసిన యార్లగడ్డ

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని గ‌న్న‌వ‌రం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం ఆయన నివాసంలో కలిశారు. ఇప్ప‌టికే వైసీపీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన యార్లగడ్డ.. చంద్రబాబును క‌లిసి గ‌న్న‌వ‌రం సీటు విష‌య‌మై ఆయ‌న‌తో చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. ఈ నెల 22న గన్నవరం సభలో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబుతో భేటీ అనంత‌రం యార్లగడ్డ మాట్లాడుతూ.. డబ్బు సంపాదించాలని తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. రాజకీయాల కోసమే అమెరికా వదిలి ఇక్కడకు వచ్చానన్నారు. ఆరేళ్లుగా వైసీపీకి సేవ చేశానని.. మూడున్నర ఏళ్లుగా వైసీపీలో ఎన్నో చూశాన‌ని తెలిపారు. తన వర్గానికి చెందిన వారికి పదవులు ఇవ్వనప్పుడు బాధ‌పడ్డానన్నారు. వైసీపీలో మన ఇష్టాఇష్టాలతో సంబంధం లేదన్నారు. వైసీపీలో తనకు సజ్జల అంటే ఇష్టమన్న యార్ల‌గ‌డ్డ‌..ఆయ‌నే తనపై ఆరోపణలు చేశారని అన్నారు.

Next Story