సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ ప్రపంచ రికార్డు సాధించాడు. చెక్‌మేట్ సాల్వర్-175లో దేవాన్స్ వేగవంతంగా పజిల్స్ సాధించి వరల్డ్ రికార్డును దక్కించుకున్నాడు. లండన్ వెస్ట్ మినిస్టర్ హాలులో నిర్వహించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డుల వేడుకల్లో దేవాన్ష్‌కు ఈ అవార్డును నిర్వాహకులు ప్రధానం చేశారు.
దేవాన్స్ ఈ ఘనత సాధించడం పట్ల తండ్రి నారా లోకేశ్ స్పందించారు. దేవాన్స్ చేసిన శ్రమకు, కష్టానికి తగ్గ ఫలితం లభించడం చాలా సంతోషంగా ఉందని నారా లోకేశ్ పేర్కొన్నారు. తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. 10 ఏళ్ల వయసులోనే దేవాన్స్ ఆలోచనలకు పదును పెట్టాడని, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా, అంకిత భావంతో దేవాన్స్ చెస్ నేర్చుకున్నాడన్నారు. దేవాన్స్ గంటల తరబడి చేసే కఠోర శ్రమను తండ్రిగా తాను స్వయంగా చూశానని అన్నారు.