జగన్ నాయకత్వంలో కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు: అంబటి రాంబాబు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అధికార కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
By - Knakam Karthik |
జగన్ నాయకత్వంలో కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు: అంబటి రాంబాబు
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అధికార కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాజకీయంగా తనను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. "నాపై ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైలులో ఉంచినా వెనక్కి తగ్గను" అని అంబటి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వాన్ని కూల్చే వరకు తన పోరాటం ఆగదని ఆయన శపథం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలను ధీటుగా ఎదుర్కొంటామని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని అంబటి రాంబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఎన్ని కేసులు పెట్టినా,ఎన్ని రోజులు జైలులో ఉన్నా,అడుగు వెన్నక్కి వేసే ప్రస్నే లేదు.Ys jagan గారి నాయకత్వంలో కూటమిని కూల్చే వరకు ఈ నా పోరాటం ఆగదు!@YSRCParty
— Ambati Rambabu (@AmbatiRambabu) February 18, 2026
ఆ కేసులో అంబటికి బెయిల్..
కాగా 2023 సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంబటిని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. ఈ క్రమంలో, జనవరి 31 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి ఇప్పుడు బయటకు రావడం ఖాయమైంది. ఇటీవల మరో రెండు కేసుల్లో అంబటికి బెయిల్ మంజూరు అయిన తర్వాత... ఆయనపై సంక్రాంతి లక్కీ డ్రా కేసులో పీటీ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కూడా గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.